ముందు రేవంత్ అవినీతి గురించి మాట్లాడు ::

3 Jun 2015

“దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజంభుజం కలిపి పనిచేద్దాము.” అంటూ చంద్రబాబు చేసిన ట్విట్టర్ లో ట్వీట్ ని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు, ముందు అవినీతి , లంచగొండి తనం పైన నోరు విప్పమంటూ రేవంత్ రెడ్డి అంశం లో ఒక క్లారిటీ ఇమ్మని చంద్రబాబు ని నెటిజన్ లు ప్రశ్నిస్తున్నారు.రేవంత్ రెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంటి? మీ కామెంట్ ఏంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.  ముందుగా రేవంత్ రెడ్డి ముడుపుల అంశానికి సంబంధించి ఎందుకు స్పందించరంటూ ప్రశ్నించారు. మీ శిక్షణలో రేవంత్ బాబు ఎలా ఉన్నాడంటూ మరో నెటిజన్ ట్విట్ చేయగా, ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ఆపండంటూ మరొకరు ట్విట్ చేశారు.