చంద్రబాబు ని సపోర్ట్ చేస్తున్న కేంద్ర మంత్రి , అందుకే కెసిఆర్ ని కలిసారా

7 Jun 2015

కేంద్ర మంత్రి పీ యూష్ గోయల్ ఆకస్మికంగా హైదరాబాద్ పర్యటించడం చంద్రబాబు ని కెసిఆర్ ని ఒకే రోజు కలవడం వెనక కారణం ఏంటి అన్నదాని పైన సర్వత్రా రాజకీయ వాదులు చర్చించుకుంటున్నారు. బీ జే పీ రాష్ట్ర కార్యాలయానికి కూడా సమాచారం ఇవ్వకుండా ఇంత హుటాహుటిన రావడం ఏంటి అన్న దానిపైన కారణం కోసం అంతా వెతుకుతున్నారు.గురువారం ఉదయం వచ్చిన గోయల్.. ఏపీ సీఎం చంద్రబాబుతో అల్పాహార విందులో పాల్గొని సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భోజన విరామ సమయంలో చర్చలు జరిపారు.రేవంత్ రెడ్డి వ్యవహారం మీదనే ఆయన వచ్చారు అని రేవంత్ ముడుపుల కేసులో చంద్రబాబు పైన ఉన్న ఆరోపణల నేపధ్యం లో అవి అన్నీ రూపు మాపుకోవడం కోసం పీ యూష్ సర్ది చెప్పే ప్రయత్నం లో విమానం దిగారు అని అంటున్నారు. కాంగ్రెస్ నేత సీ రామ చంద్రయ్య కూడా ఇదే విషయం అయి అనుమానం వ్యక్తం చేసారు.గోయల్.. మధ్యాహ్నం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. రేవంత్ కేసును ప్రస్తావించి చంద్రబాబు వ్యవహారాన్ని కేసీఆర్ ముందు పెట్టినట్లు సమాచారం. బాబును గోయల్ వెనకేసుకురావడం పట్ల ఒక దశలో కేసీఆర్.. బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తినట్లు తెలిసింది.