చంద్రబాబు ప్రజల్ని పట్టించుకోండి - వై కా పా

7 Jun 2015

కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన ఆయన విధానాల పైనా మండి  పడ్డారు చంద్రబాబు నాయుడు పాలన అసలు చిత్త సుద్ది లేకుండా నడుస్తోంది అని ఆయన ఎద్దేవా చేసారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో ఆయన రకరకాల దీక్షలు చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం ఇచ్చిన హామీల కోసం ఎదురు చూస్తున్నారు అని అవినాష్ గుర్తు చేసారు. రాష్ట్రం లో ప్రజల కష్టాన్ని పట్టించుకోని చంద్రబాబు ఉంటె ఎంత లేకపోతే ఎంత అంటూ ఆయన ఫైర్ అయ్యారు.నవ నిర్మాణ దీక్షల పేరుతో పండుగలు చేసుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీకాక, ఇన్‌పుట్ సబ్సిడీ అందక తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక.. చంద్రబాబు చెప్పినట్లు నిరుద్యోగ భృతి అందక కష్టాలు పడుతున్నారన్నారు.