బాబు కి 'రేపు' ఒక పీడా కల

7 Jun 2015

దశాబ్దాల కాలం నుంచీ పొలిటికల్ గా తనకంటూ ఒక ప్రత్యెక స్థానం ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు , మామ పార్టీ ని తనకి కైవసం చేసుకున్నా , మామ కొడుకులని ఆయన పార్టీ లో చిన్న చిన్న పోస్టులు తప్ప ఎక్కువ సీన్ ఇవ్వకుండా కట్టబెట్టినా అది చంద్రబాబు కే సాధ్య అయ్యింది. అయితే రాబోతున్న జూన్ ఎనిమిది అంటే రేపు చంద్రబాబు పొలిటికల్ జీవితం లో ఒక పీడకల లాంటిది అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. రెండవ సారి కేంద్రం అండదండలతో తెలుగు రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా సంవత్సరం క్రితం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కి ఏ సి బీ రేవంత్ రెడ్డి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది . ఒక మోస్తరు బలం ఉన్న స్థాయి నుంచి తెలంగాణా లో కనీస స్థాయికి పడిపోయి తెలంగాణా లో టీడీపీ ఉనికిని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏ సి బీ విచారాన్ చేపట్టే విషయం లో ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి  నాయుడు ని కూడా ప్రశ్నించే అవకాసం ఉండడం తో రేపు ఆయన్ని ఏ సి బీ ఎంక్వయిరీ చేసే అవకాశం ఉంది అంటున్నారు .