తెలంగాణా లో ఎక్కడా 'ఏ పీ ' కనపడదు

7 Jun 2015


దూకుడు సినిమా లో మహేష్ బాబు కంటే దూకుడు గా ప్రవర్తిస్తున్న ముఖ్య మంత్రి కెసిఆర్ న్ని చూసి ప్రతి పక్షాలకు కన్నుకుడుతున్నా కూడా తెలంగాణా ప్రజలు మాత్రం ఇష్టంగా నే ఉన్నారు అని చెప్పాలి . ఉద్యమ పంథా ని ఎక్కడా విడవకుండా రకరకాల కొత్త పథకాలతో దూసుకు పోతున్నారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తెలంగాణా మొత్తం ఉన్న వాహనాలను ఏపీ బదులు టీఎస్ అంటూ ఉండాల్సిందే అంటూ అప్పట్లో కొత్త కార్డులు ఇవ్వాలి అని ప్రయత్నించారు కానీ విషయం కోర్టు కి వెళ్ళడం తో ఎదురు దెబ్బ తగిలి కాస్త వెనక్కి తగ్గారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణా లో సుమారు నలభై లక్షల వాహనాలకు నెంబర్ ప్లేట్ లు మారిపోబోతున్నాయి. దీనికోసం 200 కోట్ల ఖర్చు కూడా ఉంటుంది పాత నంబర్ ని యధాతధంగా మారుస్తూ కేవలం ఏ పీ అనే స్థానే టీజీ అని వేస్తాం అని చెబుతున్నారు. హాయ్ సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లను ఏర్పాటు చేస్కోవలసిన అవసరం ఉంది అని ప్రభుత్వం చెబుతోంది.