మంది ప్రయాణిస్తున్న నౌక మునిగిపోయింది

3 Jun 2015

చైనాలో ఘోరం జరిగిపోయింది. యాంగ్ ట్జి నదిలో 450 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగిపోయింది. వీరంతా నాన్ జింగ్ నుంచి చోంగ్నింగ్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భారీ తుపాను నేథ్యంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మందిని రక్షించారు. మరోవైపు, ఇప్పటి వరకు కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యమయిందని అధికారులు తెలిపారు. మిగిలిన వారికోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. అయితే, తుపాను వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం తలెత్తుతోంది.