పట్టిసీమ వల్ల రైతులు నష్టపోతారు - వైకాపా

3 May 2015

పట్టిసీమ ప్రాజెక్టు పశ్చిమ , తూర్పు గోదావరి రైతులకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అని పేర్కొన్నారు వైఎస్ఆర్ సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు  ఆ ప్రాజెక్ట్ ను వెంటనే మూసి వెయ్యాలి అని ఆయన తెలిపారు . మీడియా తో మాట్లాడిన ఆయన పెండింగ్ లో ఉన్న పోలవరాన్ని పక్కన పెట్టి పట్టి సీమ ని నెత్తికి ఎక్కించుకోవడం బాబు యొక్క అలసత్వానికి మూర్ఖత్వానికి ప్రతీక అని తెలిపారు సుబ్బా రాయిడు .
ఆంద్ర రాష్ట్ర ముఖ్య మంత్రి బాబు ఇప్పటికే ఇచ్చిన హామీల గురించి అలోచించి తరవాత పట్టి సీమ గురించి ఆలోచిస్తే బావుంటుంది అని హితవు పలికారు . ఈ నెల 4, 5 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో వైఎస్_ఆర్_సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటన లో తెలిపారు.