ఆంధ్ర జ్యోతి కి తెలంగాణా మంత్రి వార్నింగ్

13 May 2015

చేతిలో ఒక న్యూస్ ఛానెల్ ఉంటె చాలు ఏమైనా చెయ్యచ్చు అనుకునే ఆంద్ర జ్యోతి ఎండీ రాదా కృష్ణ పైన టీఎస్ మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డి మరొక్కసారి విరిచుకుని పడ్డారు . తెలంగాణా మీద అక్కసుతో , ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూడలేక ఆయన విషం చిమ్ముతున్నారు అని కిరణ్ రెడ్డి అన్నారు . ముఖ్య మంత్రిని , మంత్రుల్ని టార్గెట్ చేసుకుని రోజుకి ఒక అసత్య ప్రచారం చెయ్యడం తగదు అన్నారు రెడ్డి . నిర్మల్ లో తన కుటుంబ సభ్యుల గురించి అక్రమ రవాణా విషయాలు అంటగడుతూ , చెరువుల్ని ఆక్రమించుకున్నారు అంటూ రాస్తున్న పిచ్చి రాతల్ని ఆయన కొట్టి పారేసారు . ఏదైనా వార్త చెప్పేముందు దానిని నిరూపించే దమ్ము ఉండాలి అంటూ గట్టిగా విమర్శించారు రెడ్డి . ఆంద్ర జ్యోతి మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో ఇరుక్కుపోయి ఉంది అన్న మంత్రి బురదజల్లుడు కార్యక్రమం మానుకోక పోతే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు