ఉత్తమ విల్లన్ చిక్కులు తప్పాయి , విడుదల అయ్యింది

2 May 2015

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కమల్ హాసన్ అభిమానుల కి కన్నుల పండగ మొదలు అయ్యింది , కమల్ హాసన్ నటించిన ఉత్తమ విల్లన్ నిన్నటి నుంచీ ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే , ఆర్ధిక ఇబ్బందులు కారణం గా నిన్న ఉదయం ఎనిమిద్దిన్నర కి పడాల్సిన షో అర్ధాంతరంగా ఆగిపోవడం తో ఫాన్స్ ఉసూరు మంటూ ఇళ్ళకు జేరుకున్నారు , అయితే ఇవాళ మధ్యాన్నం వరకూ ఆ సమస్య లు సర్దు మణిగి నట్టు కనపడలేదు . ఒక గంట క్రితం అంతా సవ్యంగా సాగి తమిళ నట షో లు ప్రారంభం అయినట్టు తెలిసింది . ప్రస్తుతం తెలుగు లో షో మొదలు కావడానికి సాయంత్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఈ సినిమా ప్రొడ్యూసర్ లు తిరుపతి బ్రదర్స కి ఎరోస్ ఇంటర్నేషనల్ కి మధ్య ఒచ్చిన వివాదం కారణం గా భారత దేశం లో ఈ సినిమా విడుదల ఆగిపోయింది . ఫస్ట్ షో నుంచి ఆంధ్రా , తెలంగాణా లో షో లు ప్రారంభం అవుతాయి