చంద్రబాబు కంటే అవకాశవాది ఎవరు ఉన్నారు ?

2 May 2015

వయసు బాగా పెరుగుతూ ఉండడం తో చంద్రబాబు యొక్క బుద్ది కూడా బాగా మందగిస్తోంది అని ఎద్దేవా చేసారు హరీష్ రావు.ఆయన విచక్షణ కోల్పోయి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు అని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి అవకాశ వాది ఎక్కడా ఉండడు అని అన్నారు హరీష్ . టీడీపీ లేకపోతే కెసిఆర్ సిద్ధి పేటలో గొర్రెలు కాసుకుని బతికే వారు అని బాబు చేసిన వ్యాఖల వెనక అంతర్యం గురించి హరీష్ చెప్పుకొచ్చారు . రెండు నాలుకలతో నిత్యం అబద్ధాలు ఆడే వ్యక్తి గా బాబు ని ఆయన వర్ణించారు . శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో హరీశ్ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుట్టడమే 3 ఎకరాల బంగ్లాలో పుట్టారని, ఆయన రాజకీయాల్లోకి వచ్చాక తన ఇల్లును ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిని విషయాన్ని గుర్తుచేశారు.యాదవుల ఆత్మగౌరవాన్ని కించ పరిచేలా బాబు మాట్లాడారని ఆయన పైన కేసు పెడతాము అని మర్యాదగా వారికి క్షమాపణ తెలపాలి అని ఆయన పేర్కొన్నారు