3 రోజుకు జేరిన ప్రత్యెక హోదా - నిరాహార దీక్ష

5 May 2015

ఎన్నికల సమయం లో దిల్లీ ప్రజలు కుళ్ళుకునేలా ఆంద్ర రాష్ట్రాన్ని తయారు చేస్తాను అని చెప్పిన మోదీ ప్రస్తుతం మోసకారి మాటలతో ఏపీ కి రావాల్సిన ప్రత్యెక హోదా ని కావాలనే పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు శివాజీ .
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక ప్రత్యేక హోదా ఇస్తానన్న విషయంపై మాట తప్పుతున్న కేంద్రప్రభుత్వాన్ని సవాలు చేస్తూ దీక్ష చేస్తున్న టాలీవుడ్ హీరో శివాజీ నిరాహార దీక్ష మూడవరోజుకు చేరింది. భాజాపా పబ్బం గడుపుకునే పార్టీ తప్ప పని చేసే పార్టీ గా ప్రజల మనసులలో ఎప్పటికీ ఉండదు అని , అభివృద్ధి కి సహకరించకుండా ఉండే కేంద్రం ఈ సారి వోట్లు ఎలా అడుగుతుంది అంటూ సివాకి దుయ్య బట్టారు . తనకి మద్దతు ఇస్తున్నవారికి మాత్రం చాలా ధన్యవాదాలు అని తనతో ఎవరూ రావక్కరలేదు అని తమ తమ విధానాలలో ప్రత్యెక హోదా కోసం పోరాడాలి అని శివాజీ కోరారు