బెదిరింపు , ఆకర్శ రాజకీయాలతో తెలుగు దేశం గెలుపు

3 May 2015

ఆకర్షణ రాజకీయాలు టీడీపీ కి బాగానే వర్క్ అవుట్ అవుతున్నాయి , తొలుత నుంచీ కడప పీఠం వైకాపా చేతిలో ఉండగా తెదేపా చేసిన భారీ ఆకర్షణ రాజకీయాలకు వైకాపా ఎందరినో జార్చుకుంది , అంతటితో ఆగకుండా తెలుగు దేశం లోకి రానివారిని బెదిరించడం కూడా చెయ్యడం తో ఇప్పుడు పీఠాలు చేతులు మారుతున్నాయి.
కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష స్థానానికి తెదేపా సభ్యుడు అనిల్ కుమార్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అంతకుముందు నిర్ణీత సమయంలోగా అనిల్ కుమార్ ఒక్కడే నామినేషన్ దాఖలు చేశారు. కో ఆప్షన్ సభ్యులతో కలిపి తెలుగుదేశం పార్టీకి 12 మంది డైరెక్టర్లు, వైకాపాకు 9మంది డైరెక్టర్లు ఉన్నారు.