కొట్టుకోవడం ఆపండి , ప్రజల్ని పట్టించుకోండి : వై సి పీ లీడర్

2 May 2015

వై ఎస్ ఆర్ పార్టీ కార్యాలయం లో మే డే వేడుకలని అత్యంత ఘనం గా చేసారు . ఈ సందర్భంగా పార్టీ కార్మిక విభాగం జండా ను  వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.రైతులు తో పాటు కార్మికులు ఈ దేశానికి చాలా ముఖ్యం అని పొంగులేటి తెలిపారు . తమ పార్టీ పేరులోనే శ్రామిక అనే మాటని పెట్టాం అని తాము పూర్తిగా కార్మిక పక్షపాత పార్టీ అని ఆయన చెప్పుకొచ్చారు . రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలకు మేలు చెయ్యడం లో కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో కానీ పూర్తిగా విఫలం అయ్యి ఎంతసేపు ఒకరి మీద ఒకరు బురద జల్లుడు కార్యక్రమం లో నిమగ్నులై ఉంటున్నారు అని తెలిపారు ఆయన. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కాస్త హామీల మీద మనసు పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు