తెలుగు స్మార్ట్ సిటీ లు ఇవే :

4 May 2015

ఆంధ్ర ప్రదేశ్ నుంచి
విజయవాడ,
గుంటూరు,
కర్నూలు,
చిత్తూరు నగరాలను,
తెలంగాణ నుంచి
హైదరాబాద్,
వరంగల్,
కరీంనగర్,
నిజామాబాద్,
నల్గొండ నగరాలను
స్మార్ట్ సిటీలుగా తీర్చి దిద్దనుంది కేంద్ర ప్రభుత్వం . ఎన్డీయే హామీలలో 100 స్మార్ట్ సిటీ లని నిర్మిస్తాం అని ఉన్న హామీని తీర్చుకునే పనిలో పడ్డారు అధికార కేంద్ర పక్షం వారు . తెలుగు రాష్ట్రాలలో ఆంద్ర లో నాలుగు , తెలంగాణా లో ఐదు నగరాలను ఎంపిక చేసారు .వీటిని అభివృద్ధి చెయ్యడం కోసం ఒక్కొక్క నగరానికి 100 కోట్లు ప్రభుత్వం ప్రతి సంవత్సరం విడుదల చేసి వీటిని అభివృద్ధి చేస్తుంది . స్మార్ట్ సిటీలు గా ఎంచుకున్న ఊర్లలో ఇరవై నాలుగు గంటలూ విద్యుత్ , నీరు ఎప్పుడు ఉంటాయి .  మొబైల్ సేవలు, పరిశుభ్రత వంటి అభివృద్ది పనులను ముఖ్యమంత్రి చేయవలసి ఉంటుంది.