పవన్ తలచుకుంటే ప్రత్యెక హోదా వచ్చేస్తుంది

4 May 2015

ఇవాళ నుంచీ గుంటూరు లో ఆంద్ర కు ప్రత్యెక హోదా రావడం కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన శివాజీ పవన్ కళ్యాణ్ తలచుకుంటే స్పెషల్ స్టేటస్ రావడం ఎంతసేపు అంటూ వ్యాఖ్యానించారు .కాంగ్రెస్ అప్పట్లో ప్రత్యెక హోదా విషయం లో మాట ఇచ్చి తప్పింది అని బీజేపీ కూడా దానిని అధికారం లోకి విస్మరించింది అని ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ మాత్రమె ఈ విషయం లో ఆంధ్రా కు న్యాయం చెయ్యగలడు అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ . పవన్ స్వయంగా మోదీ ని కలిసి విషయం తేల్చుకుంటే పని జరుగుతుంది అని చెప్పారు శివాజీ . ఇక, శివాజీ చేస్తున్న దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి.  దీక్ష ను భగ్నం చెయ్యడానికి కొందరు ప్రయత్నించడం తనకు చాలా బాధగా ఉంది అని పేర్కొన్నారు శివాజీ . నిజమే శివాజీ గారూ పవన్ తలచుకుంటే క్షణాల్లోనే పనులు జరగచ్చు గాక కానీ ఆయన కూడా బీజేపీ , టీడీపీ ల చేతులలో కీలు బొమ్మ , అక్కడ విషయం ఏం లేదు , ఎన్నికల సమయం లో ప్రగల్భాలు పలికి హడావిడి చెయ్యడానికే ఉన్నాడు పవన్ మీకు ఎప్పటికి అర్ధం అవుతుందో మరి