సమంతా అంతా 'ఓకే' ::

5 May 2015

సమంతా ఓపక్క పెద్ద హీరోల సరసన నటిస్తూ, మరోపక్క ఆమధ్య తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ‘అల్లుడు శీను’ సినిమాలో నటించిన సంగతి మనకు విదితమే. స్టార్ హీరోయిన్ అయిపోయాక ఏదో పెద్ద ఆబ్లిగేషన్ వుంటే తప్ప ఇలా కొత్త వాళ్లతోను, అప్ కమింగ్ హీరోలతోను నటించరు.
మరి, చెన్నయ్ బ్యూటీ సమంతా లెక్కలేమిటో తెలియదు కానీ, తాజాగా తమిళంలో కూడా ఓ వర్ధమాన నటుడి పక్కన నటించడానికి ఓకే చెప్పిందట. గతంలో హాస్యనటుడిగా నటించి, ఇప్పుడిప్పుడే హీరోగా కూడా నటిస్తున్న శివకార్తికేయన్ కు జంటగా నటించడానికి ఈ చిన్నది అంగీకరించినట్టు కోలీవుడ్ సమాచారం. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!