సల్మాన్ నేరం రుజువు అయ్యింది , జైలు శిక్ష ఖరారు కాబోతోంది .

6 May 2015

పదమూడు సంవత్సరాల నుంచీ కోర్టు లో నానుతున్న కేసు ఇన్నాల్టికి తుది తీర్పు వెలువడింది . సుదీర్ఘ విచారణానంతరం హిట్ అండ్ రన్ కేసులో ఆయన దోషి అని నిర్దారించింది.. బుధవారం ఉదయం ముంబై సెషన్స్ కోర్టు ఆయనపై నమోదైన అభియోగాలు అన్ని కూడా నిజమే అని స్పష్టం చేసింది.  ఆరోజు సల్మాన్ మద్యం తాగి కారునడిపారని, ఘటనకు ఆయన కారణం అని కోర్టు పెర్కుంది . జైలు ఈ విషయం ఐన వ్యాఖ్యలు చేసి రుజువు చెప్పడం తో , జైలు శిక్ష ఖరారు కాబోతోంది . శిక్ష ఎంత కాలం ఉంటుంది అనే దాని పైన ఇంకా కన్ఫర్మేషన్ రాబోతోంది , కుటుంబ సభ్యులు , అభిమానులు , పరిశ్రమ వర్గాలు ఆయనకీ ఎంతగానో మద్దతు అందించాయి  కానీ తీర్పు ప్రతికూలంగా రావడం తో అందరూ ఒకించ నిరాస కి గురయ్యారు . అయితే ఈ తీర్పు మీద సల్మాన్ పై కోర్టు కి అప్పీల్ చేసుకోవచ్చు అని తెలుస్తోంది . 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబై లోని బాంద్రా లో తాగి కారు నడపడం వల్ల రోడ్డు మీద ఉన్న ఫుట్ పాత్ పీడా వ్యక్తి మరణించడం , మరొక నలుగురి కి తీవ్ర గాయాలు అవడం తో ఆ కేసు బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు స్వీకరించింది , తరవాత సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది దాదాపు 13 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసు కి చాలా ఆరోపణలు , ప్రత్యారోపణలు ఎదురయ్యాయి