ఆర్ టీ సి సమ్మెతో జనాలు ఇక్కట్లు

6 May 2015

తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రయాణించడానికి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు , నిన్న అర్ధ రాత్రి నుంచీ ఆర్టీసీ బస్సుల సమ్మె కారణం గా తెలంగాణా , ఆంధ్రా రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిపేశారు . నిన్న రాత్రి బస్సులు సర్వీసులు నిలిపెయగా , మిగిలిన వాటిని ఉదయం ఆరుగంటలకి డిపోలలో ఆమెసారు . ఇక వేతన సవరణ 43% ఫిట్ మెంట్ ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టగా ప్రభుత్వం మాత్రం 27% ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలో చర్చలు విఫలం కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బంద్ కు పిలుపునిచ్చారు.ప్రయాణం మధ్యలో ఇరుక్కు పోయిన ప్రయాణీకులు బస్ స్టేషన్ లలో రాత్రంతా గడపాల్సి వచ్చింది . రైళ్ళు కూడా ఈ సందర్భంగా కిట కిట లాడుతుండడం తో ఎటు వెళ్లాని అన్నా ఇబ్బందిగా ఉంది జనాలకి