రజినీకాంత్ మూడవ సారి తాత అయ్యారు

8 May 2015

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట ఓ మగబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబమంతా సంబరాల్లో మునిగిపోయింది. రజనీ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిన్న (మే 6న) చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. సౌందర్య, 2010లో ఇండస్ట్రియలిస్ట్ అశ్విన్ కుమార్‌ను పెళ్ళాడిన విషయం తెలిసిందే.కాగా రజనీ మొదటి కూతురు ఐశ్వర్య ధనుష్ ఇప్పటికే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి రజనీని తాతయ్య చేశారు. తాజాగా రజనీకాంత్ మరోసారి తాతయ్యారు. సౌందర్య గతంలో చాలా సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక 2014లో విడుదలైన కొచ్చాడయాన్(విక్రమసింహ) సినిమా ద్వారా ఆమె దర్శకురాలిగా మారారు. ప్రస్తుతం ఆమె ఎరోస్ సంస్థతో కలిసి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.