రాజేంద్రుడు ఘటికుడే

4 May 2015

సాధారణ రాజకీయ నాయకులలాగా కబుర్లు చెప్పి పదవి ని రాగానే చెయ్యి తిప్పెయ్యకుండా రాజేంద్ర ప్రసాద్ బాగానే పని చేస్తున్నట్టు కనిపిస్తున్నారు . మే డే కానుకగా పెన్షన్స్ లు ఇవ్వడం మొదలు పెట్టిన రాజేంద్రుడు ఇవాళ నిన్న కూడా బాగానే ఈ పని కొనసాగించారు . ఒక పక్క జయసుధ పానెల్ లో వారిని కలుపుకోవడం లేదు అన్న చెడ్డ పేరు వస్తున్నా సరే తాను మాత్రం తన పనేదో చూసుకుంటూ పోతున్నారు ప్రసాద్ .
ఈ సారి జనం మార్పుకోరుకున్నారు అందుకోసమే తనకి అవకాశం ఇచ్చారు అని చెబుతూ తన మీద ఉన్న ప్రతీ బాధ్యత కి న్యాయం చెయ్యడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాను అన్నారు ఆయన .‘మాకు అందుతున్న ఫండ్స్ ని అందరికీ పర్ఫెక్ట్ గా చేరేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.,మెగా ఫ్యామిలీ తో పాటు చాలా మంది హీరో లు ఫండ్స్ మాకు ఇస్తున్నారు ” అని జెనెరల్ సెక్రెటరీ శివాజీరాజా చెప్పారు.