రాజేంద్ర ప్రసాద్ కూడా రాజకీయాలు మొదలెట్టారా ?

2 May 2015

పదవి లోకి వచ్చే ముందు చెప్పిన కబుర్లు పదవి వచ్చాక ఎవ్వరూ అంతగా పట్టించుకోరు సరికదా తాము అలా మాట ఇవ్వలేదు అంటూ తప్పించుకుంటారు . కానీ సినిమా వారు అయినా కూడా మా కొత్త అధికారులు తమ మాట నిలబెట్టుకుంటున్నారు . రాజేంద్ర ప్రసాద్ మా ప్రెసిడెంట్ గా గెలిచి సంచలనం సృష్టించడమే కాకుండా ఎందఱో పేద కళాకారులకోసం పెన్షన్ ని మొదలు పెట్టి నిన్నటి నుంచే ఇవ్వడం కూడా ప్రారంభించారు . పేద , వృద్ద , రిటైర్ అయిపోయిన కళాకారుల నిమిత్త ఇవ్వదలచిన ఈ పెన్షన్ లో సమానం గా అందరికీ పంచుతున్నాం అని ప్రకటించారు ఆయన. అయితే ట్విస్ట్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ తన వెంట జయసుధ పానల్ నుంచి గెలిచిన నరేష్ ని కానీ , మంచు లక్ష్మి ని కానీ , పరుచూరి వారిని కానీ తీసుకు వెళ్ళక పోవడం వెనక అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆయనే తీసుకు వెళ్ళలేదా లేదా వారే రాలేదా అనేది తెలియాల్సి ఉంది .