సంక్రాంతి బరిలో పవన్ - మహేష్ హోరా హోరీ.

3 May 2015

సంక్రాంతి బరి లో ఇప్పటివరకూ చెర్రీ ని మహేష్ బాబు ని మాత్రమె చూసాం కానీ తొలిసారి రసవత్తరంగా పవన్ మహేష్ లను సంక్రాంతి బరిలో చూడబోతున్నాం . ఎప్పుడో సుస్వాగతం , బాలు లాంటి సినిమాలు సంక్రాంతి కి విడుదల చేసుకున్న పవన్ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి బాట పట్టాడు . మొన్న గోపాలా గోపాలా సినిమా విజయవంతం కాకపోయినా సరే పరవాలేదు అనే కలక్షన్ లు రాబట్టిన పవన్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా విడుదల తేదీ సంక్రాంతి నాటికి ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు .
రాబోయే మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా సంక్రాంతి కి విడుదల అవుతుంది అయితే సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు కొట్టుకోవడం ఇది తొలి సారి కావచ్చు . ఒకప్పుడు సంక్రాంతి కి చిరంజీవి , బాలయ్య సినిమాలు వచ్చి పోటీ పడేవి ఇప్పుడు అదే కథ మహేష్ పవన్ విషయం లో చూస్తున్నాం