మానవత్వం చాటుకున్న హీరో ఎన్టీఆర్

13 May 2015

తెలుగు హీరోలో మరొక్క సారి తమ మనసు గొప్పది అని చాటుకున్నారు , పవన్ కళ్యాణ్ – చిరంజీవి – బాలకృష్ణ ల బాటలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన మానవతా భావాలని తెలియజేసాడు . క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక చిన్నారి కోరికని నెరవేర్చి ఆమెని కలిసాడు . వరంగల్ జిల్లా వర్థన్నపేటకు చెందిన శ్రీనిధి రెండున్నర ఏళ్ల నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఎన్టీఆర్‌ని చూడాల‌న్న‌ది చిన్నారికోరిక‌. మేక్ ఏ విష్ సంస్థ ద్వారా ఈ విషయం ఎన్టీఆర్ కి తెలిసింది. వెంటనే ఆయన చిన్నారి కలవడానికి వెళ్లారు.  ప్రస్తుతం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనిధిని నేరుగా వెళ్లి కలిశారు జూనియర్. మెక్ ఏ విష్ సంస్థ వారు ఈ విషయం లో ఎన్టీఆర్ కి ప్రత్యెక కృతజ్ఞత తెలుపగా ఆయన ఈ విషయాన్ని తనకి చేరవేసిన వారికే తిరిగి కృతజ్ఞత తెలుపుతున్నట్టు ప్రకటించారు  ” ఏమీ మాట్లాడాలో అర్థం కావడంలేదు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. నన్ను కలవడం ద్వారా ఆ పాప సంతోషంగా ఉంటుందంటే అంతకంటే ఏం కావాలి? నన్ను చూసి చాలా సంతోషించింది. అదే సంతోషంతో క్యాన్సర్‌ను జయించి మనముందు నవ్వుతూ రావాలి. ” అంటూ బాధగా అన్నారు ఎన్టీఆర్ . ఆ మధ్య పవన్ కలిసిన పాప శ్రీజ తరవాత అనారోగ్యం తగ్గిపోయి పవన్ ని కలవడానికి రావడం మనం చూసాం , అలాగే ఈ పాప కూడా రావాలని దేవుడ్ని ప్రార్ధిద్దాం