తానా ముఖ్య అథితి గా వెంకీ

3 May 2015

ఉత్తర అమెరికాలో తెలుగు అసోషియేషన్ (తానా) సంస్థ ప్రతీయేటా అక్కడి తెలుగువారందరినీ ఒక వేదిక వద్దకు చేర్చి 3రోజులపాటు సంబరాలు జరుపుకుంటుంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలానే ఈ ఏడాది కూడా సినీ,రాజకీయ ప్రముఖులను ఆహ్వానించనుంది.
తానా 20వ సభ జూలై నెలలో 2 నుండి 4వరకూ జరగనుంది.తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, సురేష్ బాబుముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. వెంకయ్య నాయుడు రాజకీయ రంగంనుండి హాజరుకానున్నారు. ఈ మూడు రోజులూ కల్చరల్ మరియు ఎంటర్టైన్మెంట్ ప్రొగ్రామ్ లు నిర్వహించనున్నారు.