నేపాల్ లో మళ్ళీ భూకంపం

3 May 2015

భూకంప దారుణ ప్రకోపం లో నుంచి నేపాల్ ఇంకా బయట పడలేదు , ఇవాళ ఉదయం మరొక్క మారో మూడు ప్రాంతాలలో భూ ప్రకంపనలు నమోదు అయ్యి అక్కడి జనాలని వణికిస్తున్నాయి . ఒక్కసారిగా మళ్ళీ ప్రజలు భయాందోళన ల తో రోడ్డు మీదకి పరిగెట్టడం తో అంతా గందరగోళం నెలకొంది . ఉదయం సిందుపాల్ చౌక్ అనే జిల్లాలో నాలుగు , మరొక రెండు చోట్ల 4. 5 గా భూకంప తీవ్ర నెలకొంది .
వారం రోజుల క్రితం నేపాల్ లో వచ్చిన భూకంపాని ఇప్పటికే ఏడు వేలకు పైగా జనాలు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే .  భూకంప తీవ్రత కు జనం అతలాకుతలం అయ్యి రోడ్ల మీద నివసిస్తున్నారు . ఆరోజున వచ్చిన భారీ భూకంపం తరవాత కనీసం వందసార్లు పైగా ప్రకంపనలు నమోదు చేసారు ప్రభుత్వం వారు , తాజాగా వచ్చిన ప్రకంపనలు నష్టాన్ని కలిగించ లేదని ఒక ప్రకటన లో నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.