నీతూ బయట పడింది

6 May 2015

ఎర్రచెందనం కేసు లో సంచలనం సృష్టించిన హీరోయిన్ నీతూ అగర్వాల్ ఇవాళ ఉదయం ఆరు గంటలకు జైలు లో నుంచి విడుదల అయ్యింది , ఆమె బిల్ కోసం పెట్టుకున్న పిటీషన్ ని పరిగణలో తీసుకున్న కర్నూలు ఆళ్లగడ్డ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది . నంద్యాల సబ్ జైలు అధికారులు నీతూ ని బుధవారం ఉదయం ఆరుగంటలకి వదిలేసారు . ప్రేమ ప్రయాణం చిత్రం తో సినిమాలలో కి ఎంటర్ ఐన హీరోయిన్ నీతూ అగర్వాల్ ఆ సినిమా నిర్మాత మస్తాన్ ని పెళ్లి చేసుకుని జీవితం గడిపింది , అతను ఒక పెద్ద ఎర్ర చెందనం ముఠా నాయకుడు అని తెలిసి కూడా తానూ ఏమీ చెయ్యలేకపోయాను అని చేబుతోంది , అతను ఆమె ని టార్చర్ పెట్టాడు అని చెప్పింది నీతూ . నీతూపై నిఘా పెట్టిన పోలీసులకు ఆమె ఖాతా నుండి స్మగ్లర్లకు నిధులు సరఫరా అయిన విషయం బయటపడింది. దీంతో ఆమె కి కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ లో ప్రమేయం ఉండి ఉంటుంది అనే ఆలోచన తో వారు ఆమెని అరస్ట్ చేసారు , ఇంటరాగేషన్ లో చాలా విషయాలు బయట పెట్టింది నీతూ