నాగ చైతన్య క్రేజీ సినిమా షురూ  

8 May 2015

కుర్ర హీరోలలో వరస పెట్టి సినిమాలు తీసి జనాల్ని అలరించడం లో నాగ చైతన్య్హ కి పెట్టింది పేరు , సినిమాల పైన ఉన్న ప్రేమో లేక దీపం ఉండగానే ఇల్లు  చక్క బెట్టుకోవాలని ఆయన తండ్రి ఇచ్చిన ఐడియా నో తెలీదు కానీ నాగ చైతన్య ప్రస్తుతం గట్టిగానే సినిమాలకి వరస కట్టాడు . ఒక సాధారణ హిట్ కొట్టిన ఏ డైరెక్టర్ అయినా కొత్త కథాంశం చేతిలో ఉంటె చూసేది నాగ చైతన్య వైపే అనడం లో ఎలాంటి సందేహం లేదు . గతంలో ఆయన గౌతమ్ మీనన్ కాంబినేషన్లో చేసిన ‘ఏ మాయచేశావే’ సినిమా యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమా మొదటి షెడ్యూలు 45 రోజులపాటు చెన్నై లో కొనసాగుతుందని చెబుతున్నారు. ప్రేమ దృశ్యాలను అనుభూతి పరిమళంతో ఆవిష్కరించడంలోను, యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడంలోను గౌతమ్ మీనన్ సిద్ధహస్తుడు. కాబట్టి వీటి నేపథ్యంగానే ఈ సినిమా ఉండవచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా నాగచైతన్య కెరియర్లో చెప్పుకోదగినగా ఉంటుందనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.