వోట్లు వెయ్యక పోతే పని చెయ్యరట

13 May 2015

మాకు ఓట్లు వేయనోళ్లకు మేము ఎట్లా పని చేసి పెట్టాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వరంగల్ జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం ప్రజల ను ప్రశ్నించారు. కన్నాయిగూడెంలో మంగళవారం బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి మంత్రి వచ్చారు. నియోజకవర్గంలోని అన్నిరోడ్లు పూర్తయ్యాక ఈ పనులు ప్రారంభిస్తామని అన్నారు.
పంచాయతీ, పీఏసీఎస్, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామస్తులు సహకరించలేదని గుర్తు చేశారు. తర్వాత తేరుకున్న మంత్రి గ్రామపెద్దలను పిలిపించుకొని తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. చివరికి ఆయన రోడ్డు పనులను ప్రారంభించారు