మణిరత్నం కి గుండె పోటు వార్త ! అందరికీ కంగారు

6 May 2015

దేశం లోనే అత్యంత గొప్ప దర్శకులలో ఒకరు ఐన మణిరత్నం ఇప్పుడు వార్తల్లో నిలిచారు , ఆయన కి గుండె పోటు వచ్చింది అంటూ మీడియా సంచలనం సృష్టించడం తో కొన్ని గంటలు సర్వత్రా కంగారు నెలకొంది , తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘ఓకే బంగారం’ (ఓకే కన్మణి). ఈమధ్యే విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ చిత్రం తరవాత ఆయన కొత్త సినిమా ఏదీ మొదలు పెట్టలేదు ఇలోగా ఆయన దిల్లీ లో విశ్రాంతి తీసుకుంటున్నారు . అయితే చిన్న ఆరోగ్య సమస్య తలెత్తడం తో ఆసుపత్రి లో అడ్మిట్ చేసారు దాంతో ఆయనకీ గొండె పోటు వచ్చింది అంటూ మీడియా నానా రభస చేసింది . ఆయన అభిమానులకి చాలా కంగారు వెయ్యడం తో వెంటనే మద్రాస్ టాకీస్ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న మాల మణియన్ అలాంటిది ఏమీ లేదు అని ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రి కి వెళ్ళారు అని మీడియా తప్పుడు కథనాలు ఆపాలి అని విజ్ఞప్తి చెయ్యడం తో అందరూ శాంతించారు