అలాంటి పనులు చెయ్యకు లోకేష్ బాబు

2 May 2015

ఆంద్ర రాష్ట్రానికి పెట్టుబడులకి తండ్రి తరవాత కొడుకు బయలు దేరాడు , ఆంద్ర రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా తన పర్యటన ఉంటుంది అంటూ నారా లోకేష్ తన పర్యటన ఉండబోతోంది అని తెలిపారు . ఆంధ్రా సి ఎం చంద్రబాబు నాయిడు ఈ నెల 13 నుంచీ అమెరికా లో ప్రత్యేకంగా పర్యటించబోతున్న విషయం తెలిసిందే . ఆంద్ర రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాస భారతీయ వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తానని చెప్పారు. అలాగే యూఎస్_లోని వివిధ రాష్ట్రాల గవర్నర్లుతో కూడా భేటీ అవుతానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఈ నెల 7వ తేదీన  కలుస్తానని లోకేశ్ తెలిపారు.అప్పట్లో విడుదల అయిన ఫోటోలు గుర్తు వస్తుంటే లోకేష్ బాబు అమెరికా పర్యటన గురించి తలచుకుంటేనే చంద్రబాబు భయపడుతున్నట్టున్నారు . మళ్ళీ అలాంటి వేషాలు వెయ్యకుండా బుద్ధి గా వెళ్ళిరమ్మని క్లాసు కూడా పీకే ఉంటారు