లయన్ తో పోటీ పడే దమ్ముందా టైగర్ కి ?

1 May 2015


అటు తిరిగి ఇటు తిరిగి దాదాపు రెండు నెలలు విడుదల ని వాయిదా వేసాడు సందీప్ కిషన్ , తన సినిమా టైగర్ ఆడియో ఫెబ్రవరి లోనే విడుదల చేసి సినిమా విడుదల కి మాత్రం వరసగా సన్ ఆఫ్ సత్యమూర్తి , ఓకే బంగారం లాంటి సినిమాలు ఉండడం తో జాగ్రత్త గా బరిలోకి దిగాలి అనే ఉద్దేశం తో ఆగాడు కానీ , ఇప్పుడు అవన్నీ అయిపోవడం తో ఎలాగైనా ఈ నెల రంగలోకి దూకాలని చూస్తున్నాడు ఎందుకంటే వెనకాల రుద్రమదేవి , ప్రభాస్ బాహుబలి , శ్రీమంతుడు లాంటి సినిమాల లిస్టు ఉంది కాబట్టి కాస్త మే లోనే కానిచ్చేయాలని చూస్తున్నాడు సందీప్. సందీప్ కి ఈ నెల పెద్దగా పోటీ లేకపోయినా ఈ నెల బాలయ్య బాబు లయన్ విడుదల ఉండడం తో కాస్త జంకుతున్నాడు . ఏదేమైనా మే 8 న బాలయ్య లయన్ వస్తే
తన సినిమా ఆ తదుపరి వారం విడుదల చేస్కోవచ్చు అని చూస్తున్నాడు . కానే బాలయ్య అభిమానులు మాత్రం టైగర్ హిట్ అయితే లయన్ కలక్షన్ కి దెబ్బ తింటుంది అని ఆలోచిస్తున్నారు . లయన్ కి పోటీ ఇచ్చే అంత మొనగాడు అయ్యాడా అంటున్నారు మరి కొందరు ?