అందం కాదు అదృష్టం - అభినయం ఉండాలి అని నిరూపించింది

8 May 2015

సినిమా పరిశ్రమ ఎందరికో ఒక కల అలాంటిది చిన్న వయసులోనే అగ్రస్థానానికి ఎగబాకుతోంది లక్ష్మీ మీనన్ . అదృష్టం – టాలెంట్ కలిగిన పిల్ల గా తమిళం లో పెద్ద సినిమాలు హిట్ కొట్టిన లక్ష్మి పెద్ద కలర్ ఉన్న హీరోయిన్ కూడా కాదు . చేసినవి కూడా కొన్నే సినిమాలు కానీ అవి ఇచ్చిన హిట్ లతో ఆమె కెరీర్ దూసుకుపోతోంది . ఇప్పుడు లక్ష్మీ కి మరొక మంచి సినిమా అవకాసం దక్కింది . సామి దర్సకత్వం లో ఒక సినిమా చేస్తోంది లక్ష్మి , ఆమెనే దృష్టిలో పెట్టుకుని సామి కథ సిద్దం చేసాడు , ఆయన తీసిన సినిమా తోనే పేరు తెచ్చుకుని ఇంత పెద్ద స్టార్ అయిన లక్ష్మి ఆయన అభ్యర్ధన ని వెంటనే ఓకే చెప్పేసింది . ” పెన్న సామి ” అనే ఈ సినిమా కి లక్ష్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొత్త సినిమా కి ఓకే చెప్పింది . ఇండస్ట్రీ లో కావాల్సింది అందం కాదు టాలెంట్ అంటూ ప్రూవ్ చేస్తోంది ఈ చిన్నది