నీళ్ళ కోసం వంద బావులు తవ్వేసారు , కేరళ లో మహిళల సంచలనం

8 May 2015

భవిష్యత్తు లో నీటి ఎద్దడి ఏ రకంగా ఉండబోతోంది అనేదానికి ఇది ఒక చిన్న నిదర్సనం మాత్రమే , అది ‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా, అపారమైన నీటి వనరులున్న రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళ. అయితేనేం, అక్కడా మంచినీటికి కటకటలాడే గ్రామాలున్నాయి. అయితే, నీటి కోసం మరీ లోతుగా తవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో 20 మంది మహిళలు ఏకమై 100 బావులు తవ్వారు. కేరళలోని మలప్పురం జిల్లాలోని కలికావు గ్రామంలో మహిళలు తమ సత్తా చాటుతూ, నీటి కరువు తీర్చారు. వీరంతా కలిస్తే ఒక్క రోజులో ఒక బావి తవ్వేస్తారు. అందుకోసం రూ. 20 వేలు వసూలు చేస్తారు. ఒకవైపు ఉపాధి, మరోవైపు గ్రామంలో నీటి కొరత తీరుస్తున్నామన్న ఆనందం కలుగుతోందంటున్నారు ఈ మహిళలు.