కెసిఆర్ గొర్రలు కాసుకోవలి : బాబు

1 May 2015

ఇటు మాట ఇటూ అటు మాట అటూ చెప్పడం చంద్రబాబు కి కొత్తే కాదు , రెండు కళ్ళు అంటూ రెండు నాల్కల ధోరణి మొదటి నుంచీ రుచి  చూపిస్తూనే ఉన్నారు బాబు గారు. ప్రస్తుతం ఈస్ట్ గోదావరి పర్యటన లో ఉన్న బాబు తన విమర్శలు అన్నీ కెసిఆర్ మీద పెట్టారు . ఉన్నదేమో ఆంధ్రా లో అది కూడా ఈస్ట్ గోదావరి లో అయితే గియితే వైసీపీ వారని ఏమన్నా అంటే అన్నా కాస్త సంబంధం ఉంటుంది ఏమో కానీ కాకినాడ పర్యటన లో ఉన్న బాబు కెసిఆర్ పైన ఘాటైన విమర్శలు చెయ్యడం కాస్త వింతగా అనిపిస్తోంది . తెలుగు దేశం పార్టీ లేకపోతే కెసిఆర్ ఈ పాటికి గొర్రెలు కాసుకునే వాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి . రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న సమశ్యల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహాయం తో వాటిని అధిగమిస్తాం అని మాట ఇచ్చారు ఆయన . కెసిఆర్ ని వ్యక్తిగతం గా ఎప్పుడూ ఏమీ అన్ని బాబు ఇవాళ ఈ రేంజ్ లో ఎండగట్టే సరికి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి . టీడీపీ  నుంచి వెళ్లి ప్రత్యెక పార్టీ పెట్టి ముఖ్య మంత్రి అయ్యారు అనే కెసిఆర్ మీద బాబు కోపం అయితే , మరి బాబు ఏ పార్టీ నుంచి టీడీపీ లోకి దూరారో తెలుగు తమ్ముళ్ళకి తెలీదా ?