అవినీతి పరులని కాపాడుతున్న ప్రభుత్వం

1 May 2015

ఎర్ర చందనం స్మగింగ్ విషయం లో ఇంకా అవినీతి జరుగుతూనే ఉంది అని మనకి సమాచారం వస్తోంది , అవినీతి అంటే మళ్ళీ దుంగలను కొయ్యడం కాదు ఈ వ్యవహారం వెనక ఉన్న పెద్దలను , కాపాడడం  . ఆపరేషన్ రెడ్ ఎందుకూ పనికి రాని ఒక ఆపరేషన్ గా తయారయ్యింది , అంతర్జాతీయ స్మగ్లర్లను ఈ ఆపరేషన్ రెడ్ లో అరెస్ట్ మాత్రమె చేసి విచారించారు . విచారణ లో ఎర్ర స్మగ్లర్ ల వెనక ఉన్న ఎనిమిది మంది డీఎస్పీ లు , 24 మంది ఎస్సైలు పైన కఠినం గా చర్యలు తీసుకోవాలనే చిత్తూర్ ఎస్పీ (2014 లో ) ఇచ్చిన నివేదిక ని బుట్ట ధాకలు చేసారు . కేవలం ఒక అధికారి పైన మాత్రమె వేటు వేసి ఊరుకుంది ప్రభుత్వం. ప్రభుత్వమే అలాంటి అవినీతి అధికారుల కొమ్ము కాస్తుంటే ఎవ్వరు మాత్రం ఈ దారుణాలు ఆపగలరు అంటూ అంతా వాపోతున్నారు