జ్ఞానవేల్ బాహుబలి పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు

4 May 2015

సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘బాహుబలి’తో నేను భాగస్వామ్యం అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే, ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుందని’ అని ట్విట్టర్ లో ట్వీట్ చేసారు జ్ఞాన వేల్ , తమిళం లో స్టూడియో గ్రీన్ బ్యానర్ తో బాహుబలి హక్కులు తన సొంతం చేసుకున్నారు ఈయన .
పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ గా ఉన్న బాహుబలి కి కావలసినంత సమయం  కూడా ఉండడం తో అక్కడ వైరల్ గా ప్రమోషన్ చెయ్యడానికి చూస్తున్నారు రాజా . ఈగ , మగధీర లతో బాగా పేరు ఉన్న రాజమౌళి తో ప్రమోషన్ చక్కగా చేస్కుంటే తన బ్యానర్ లో ఇదే పెద్ద సినిమా అవుతుంది అని ఆశ పడుతున్నారు ఆయన.