పెద్ద హీరో సినిమాల రేంజ్ లో కాసులు కురిపించిన గంగ

3 May 2015

హర్రర్ అంశాన్ని తీసుకుని దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి తీస్తున్నా కూడా జనం ఇంకా చూస్తున్నారు అదే లారెన్స్ లోని టాలంట్ అని చెప్పుకోవాలి . రాఘవా లారెన్స్ తన ముని సినిమా ని మొదవ భాగం మొన్న మే డే న విడుదల చేసిన విషయం విధితమే ఈ సినిమా తొలి రోజు ఉత్తమ విల్లన్ నుంచి గట్టిగానే పోటీ ఎదురు కుంటుంది అనుకున్నారు అందరూ. కానీ ఒక దాశ లో ఉత్తమ విల్లన్ సినిమా వరసగా ఎనిమిది షో లు పోస్ట్ పోన్ అవ్వడం తో గంగ తెలుగు లో తొలి రోజు ఒక తెలుగు పెద్ద హీరో చెయ్యగలిగే అంత కలెక్షన్ లు రాబట్టింది .
సినిమా యూనిట్ వర్గాలు తెలిపిన ప్రకారం అన్ని ప్రాంతాలను కలుపుకొని ఈ సినిమా మొదటిరోజు సుమారు రూ. 3.55కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిందని తెలుస్తోంది. నైజాంలో ఈ సినిమా 1.1కోట్ల రూపాయలను సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా లభించడంతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.