గంగ నాలుగు కోట్లు రాబట్టిందా ?

2 May 2015

అదేదో సామెత లాగా ఉత్తమ విల్లన్ విడుదల లేట్ అవ్వడం ఇప్పుడు లారెన్స్ కి తీవ్రంగా కలసి వచ్చే అంశం అయ్యింది . బీ సి సెంటర్ లలో అదరగొడుతున్న గంగ తో లారెన్స్ తిరుగు లేకుండా దూస్కు పోతున్నాడు . ఇంతకు ముందు వరకూ కూడా ఉత్తమ విల్లన్ షో లు జరగకపోవడం తో అందరూ గంగ కే క్యూ కడుతున్నారు . నిన్న మే డే కావడం తో సెలవు రోజు న గంగ కి సూపర్ కలెక్షన్ లు వచ్చాయి ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . లారెన్స్ హీరో గా తాప్సీ హీరోయిన్ గా నిత్యా మీనన్ ముఖ్య పాత్ర లో నటించిన ఈ సినిమా గంగ తమిళం లో కంచన 2 గా విడుదల అయ్యి వారం క్రితం నుంచే కలక్షన్ లు ఇరగ దీస్తోంది ఈ నేపధ్యం లో ధియేటర్ లో ఖాళీ కోసం ఎదురు చూసిన తెలుగు వెర్షన్ నిర్మాత బెల్లం కొండ సురేష్ నిన్న ఈ సినిమా ని మొత్తానికి విడుదల చేసాడు . దుమ్ము రేపే కలక్షన్ లతో గంగ యమా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది , దాదాపు మొదటి రోజు నాలుగు కోట్లు వరకూ రాబట్టింది అంటున్నారు ఇంకా అధికారికం గా తెలియాల్సి ఉంది