సంక్రాంతి కి గబ్బర్ సింగ్ 2

2 May 2015

ఈ మధ్యే ‘గబ్బర్ సింగ్ 2′ సినిమా మే నెలలోనే సెట్స్‌పైకి వెళ్ళనుందనే విషయాన్ని నిర్మాత శరత్ మరార్ ప్రకటించగా, తాజాగా షూటింగ్ మొదలుపెట్టకముందే రిలీజ్ టైమ్‌ను కూడా ప్రకటించారు. 2016 సంక్రాతికల్లా ఈ సినిమాను పూర్తి చేసి పండగ కానుకగా విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ‘పవర్’ సినిమా ద్వారా హిట్‌ కొట్టిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అనిషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు.