తెలుగు హీరో , ప్రత్యెక హోదా కోసం నిరాహార దీక్ష

2 May 2015

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నా తాను మాత్రం ఊరికే ఉండను అని ప్రకటించారు హీరో శివాజీ , మే మూడు అంటే రేపటి నుంచీ గుంటూరు లో నిరాహార దీక్ష చేయ్యబోతున్నట్టు ప్రకటించారు ఆయన . బీ జే పీ , టీ డీ పీ కలిసి ఈ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించాయి అని వాపోయిన శివాజీ ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులకి సిగ్గు అనేది ఉంటే తనతో రావాలని కోరారు ఆయన . ఇది ఎలాంటి రాజ కీయ పార్టీ కి సంబంధించింది కాదు అని చెప్పిన శివాజీ ఒకవేళ స్పెషల్ స్టేటస్ వస్తే వెంటనే తానూ సామాన్య కార్యకర్తగా ఉండిపోతాను తప్ప దీనిని అవకాసం గా చేసుకుని రాజకీయాలలో చురుగ్గా పాల్గొనను అని తెలిపారు . చచ్చి పోయిన పోతాను కానీ స్పెషల్ స్టేటస్ కోసం మాత్రం పోరాడతాను అని ప్రకటించారు ఆయన . మీడియా తో మాట్లాడిన శివాజీ ఊరికి ఒక వ్యక్తి ,  గ్రామానికి ఒక వ్యక్తి చొప్పున తనతో వచ్చి పోరాడాలి అని , లేదంటే ప్రత్యెక హోదా లేకపోతే దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయి అని . రైతుల ఆత్మహత్యలు జరుగుతాయి అని చెప్పుకొచ్చారు