దావూద్ లొంగి పోతా అన్నాడు , సి బీ ఐ ఒప్పుకోలేదు

2 May 2015

దిల్ల్లీ మాజీ పోలీస్ కమీషనర్ నీరజ్ కుమార్ మోస్ట్ వాంటెడ్ కిల్లర్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి సంచలన విషయాలను బయట పెట్టారు . బొంబాయి లో వరసగా జరిగిన పేలుళ్ళ తరవాత పదిహేను నెలల సమయానికే తాను లొంగి పోతాను అని దావూద్ రాయభారం పంపినట్టు చెప్పారు . అప్పటి సీబీఐ డీఐజీగా ఉన్న తనకు దావుద్ మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు నీరజ్ కుమార్ చెప్పారు. భారత్ వస్తే ప్రత్యర్థులు తనని హతమారుస్తారెమోననే భయంతోనే దావుద్ లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు నీరజ్ తెలిపారు. కానీ అతను లొంగిపోతానన్న ప్రతిపాదనని సీబీఐ అంగీకరించలేదని చెప్పారు.భారత్ కి వచ్చి లొంగి పోయే విషయం లో రాంజట్మలానే తో రాయబారం సాగించాడు దావూద్ , రాం అప్పట్లో పెద్ద న్యాయవాది అయితే సీబీ ఐ దీనికి అంగీకారం తెలపలేదు . 2013 వరకూ దిల్లీ కి పోలీస్ కమీషనర్ గా చేసి రిటైర్ అయిన నీరజ్ కుమార్ తన అనుభవాలను పుస్తకం లో రాయబోతున్నారు