చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి

1 May 2015

అన్ని విషయాల్లో ఆంద్ర రాష్ట్రాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాం అనికల్లబొల్లి కబుర్లు చెప్పిన బీజీపీ ఇప్పుడు దారుణంగా హ్యాండ్ ఇస్తోంది . ఏపీ సర్కారు కూడా నిమ్మకు నీరేత్తనట్టు ప్రవర్తిస్తూ ఉండడం తో ఏపీ కి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని మాట ఇచ్చిన కేంద్రం కనీసం స్మార్ట్ నగరాల ఎంపిక లో సైతం ఏపీ ని కూరలో కరివేపాకు లాగ తెసేసింది. ఆంద్ర ప్రాంతం కంటే తెలంగాణా కి మంచి చేస్తే అది తమకు వోట్లను గుప్పిస్తుంది అని ఆలోచించారో ఏమో తెలంగాణా లో ఐదు పట్టణాలను స్మార్ట్ సిటీ లుగా ఓకే చేసి ఆంద్ర రాష్ట్రం లో నాలుగంటే నాలు ప్రదేశాలకు ఆ అవకాసం ఇచ్చింది. అది కూడా విశాకపట్టనాన్ని పక్కన పెట్టేసారు అంటీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవాలి . పది జిల్లాల తెలంగాణా కు ఐదు స్మార్ట్ సిటీ లు ఇచ్చి 13 జిల్లాల ఏపీ కి నాలుగు ఇవ్వడం వెనక కథేంటి ? బాబు ఇప్పటికైనా కళ్ళు తెరవడా? పోరాడడా ?