బాబు సర్కారుకు ఆ దమ్ముందా ?

4 May 2015

మంగళ గిరి యమ్మెల్యే (వైకాపా) రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలు విసిరారు , సర్కారుకి గనక ధైర్యం ఉన్నట్లయితే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి చూడాలని ఫలితం ప్రభుత్వానికి , బాబు కి బుద్ధి ఒచ్చేలాగా చేస్తుంది అని చెప్పారు ఆర్కే (రామ కృష్ణా రెడ్డి ) . రాజధాని రైతుల పిటిషన్_లో న్యాయం ఉందని కోర్టు భావించినందువల్లే వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారాయన .ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల్ని , భూమి ఆస్థి పరులని తీవ్రంగా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలోనే భూసేకరణ చేట్టాన్ని ప్రయోగించే డబ్బులేక ఆగిపోయింది అన్నారు . చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. రైతులతో కలిసి వైకాపా పోరాడుతుంది అని అన్నారు ఆర్కే , అవసరం అయితే న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కుతాను అన్నారు