కొత్త డ్రీం గాళ్ ఈమె 

3 May 2015

డ్రీమ్ గాళ్ … ఈ బిరుదు భారత సినీ చరిత్రలో ఒకే ఒక్కరికి వుంది. తనే హేమమాలిని! దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ వెండితెర అందం ఇప్పుడు తన బిరుదును మరో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కి ఇచ్చేసింది. ఇటీవలే ఈ ముచ్చట చోటుచేసుకుంది. బాలీవుడ్ తాజా అందం శ్రద్ధా కపూర్ ఈమధ్య హేమాను కలిసింది. ఆ సందర్భంగా ఇద్దరూ కలసి నాటి, నేటి సినిమాల గురించి, కథానాయికల సౌందర్యం గురించి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా శ్రద్ధాను బాలీవుడ్ కొత్త ‘డ్రీమ్ గాళ్’గా హేమా అభివర్ణించిందట. దాంతో ఈ చిన్నదానికి కాస్సేపు నోటమాట రాలేదు. తర్వాత తేరుకుని, హేమా మేడంకు కృతజ్ఞతలు చెప్పి వచ్చి, ఇప్పుడు అందరి వద్దా తన కొత్త బిరుదు గురించి చెప్పుకుంటూ పొంగిపోతోంది!