బాలయ్య 99 కి అంతా సిద్దం

4 May 2015

కోనా వెంకట్ డయలాగ్ లు , స్క్రీన్ ప్లే ఇవ్వబోతున్న బాలయ్య 99 వ చిత్రానికి సర్వం సిద్దం అయినట్టు తెలుస్తోంది . బాలయ్య తన తదుపరి చిత్రానికి లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ కి కాల్ షీట్ లు ఇచ్చిన విషయం తెలిసిందే . ఈ ప్రాజెక్ట్ మొదలు కావడానికి పెద్ద గా సమయం కూడా పట్టాడు .
ఇటీవలే కోనా వెంకట్ స్క్రిప్ట్ ని బాలకృష్ణకి వినిపించినట్టు అది బాలయ్య బాబుకి చాలా నచ్చినట్టు .. పెద్దగా మార్పులు కూడా కోరుకొని బాలయ్య ఫైట్ లు మాత్రం కాస్త భారీగా ఉండాలి అని కోరుకున్నాట్టు తెలుస్తోంది , దానికి కోనా ఓకే అన్నారు  దీంతో రెట్టించిన ఉత్సాహంతో బృందమంతా సినిమాని త్వరలో మొదలుపెట్టే పనిలో వున్నారు.