బాహుబలిని భయపెట్టిన బాబు..!?

1 May 2015

అమాయకుడిని చేసి.. ఇష్టానికి రాజమౌళిని వాడుకోవటం అందరికి అలవాటు అయిపొయింది. ఏమి అనడు అనే ధైర్యం కావచ్చు.. పోనిలే పాపం అని వదిలేస్తాడు అనే తెలికతనం కావచ్చు.. మొత్తానికి ఎలా కుదిరితే.. అలా రాజమౌళికి ఉన్న క్రేజ్ ను దోచుకోవటానికి.. అందినకాడికి ఉపయోగించుకోవటానికి గోతికాడ గుంట ఫాక్స్ ల్లా.. చాల మందే ఎదురు చూస్తూ ఉంటారు.
కాని అదేం యాదృచ్చికమో కాని.. ఎప్పుడూ కూడా సంపూర్నేష్ బాబే.. సంపూర్ణంగా రాజమౌళిని వాడుకుంటున్నాడు. అసలు రాజమౌళి వేసిన ఒక ట్విట్ మూలంగానే సంపుకు స్టార్ గిరి వచ్చింది. ఇప్పుడు మళ్లీ రాజమౌళిని ఉపయోగించుకునే డూపర్ స్టార్ అనిపించుకోవాలని చూస్తున్నాడు సంపూ. ఇంతకీ మేటర్ ఏమిటి అంటే.. సంపూ కొత్త సినిమా సింగం 123 ప్రచారానికి రాజమౌళినే వాడుకోవటం మొదలు పెట్టారు.
ఫస్ట్ బాహుబలి సినిమా డేట్ ప్రకటించినప్పుడు.. సింగం 123 కూడా అదే రోజున వస్తుంది అని అనౌన్స్ చేశారు. కాని బాహుబలి మే 15 న రావటంలేదు. అందుకు కారణం సంపూ సింగం 123 సినిమా లైన్ లో ఉండటమే.. అని ప్రచారం మొదలెట్టారు..! అలా సినిమా పై అందరిలోనే ఆసక్తి కలిగించే పనిలో పడ్డారు. మరీ ఈ ప్రచారాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రీసివ్ చేసుకుంటారో..  చూడాలి. పొతే ఇక్కడ విశేషం ఏమిటి అంటే.. సింగం 123 సినిమాకు నిర్మాత మంచు విష్ణు. స్వతహాగా సూపర్ స్టార్ అయిన మంచు విష్ణుకు రాజమౌళిని వాడుకోవలసిన అవసరం ఏమిటో..?