బాహుబలి జూలై 10 న వస్తున్నాడు

1 May 2015

ఎప్పటినుంచో ఊరిస్తున్న బాహుబలి సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు, మనవద్ద నున్న సమాచారం ప్రకారం బాహుబలి జూలై 10 న రానుంది,  ఇదే రోజున ఈగ , మగధీర , సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్లు కూడా విడుదల అయ్యాయి . మొదటి పోస్టర్ ని రాజమౌళి ఇవాళ విడుదల చేసారు ఉదయం ప్రకటించినట్టుగానే సాయంత్రం నాలుగు గంటలకు తన ట్విట్టర్ పేజి లో ఫస్ట్ లుక్ ని ఉంచారు . కే రాఘవేంద్ర రావు బీ ఏ సమర్పించు అంటూ ఒచ్చిన పోస్టర్ లో ఒక తల్లి సముద్రం లో నుంచి బిడ్డను ఆకాశం లోకి నిలబెట్టిన ఫోటో మనకి కనిపిస్తుంది . తెర్లుతున్నసముద్రం నడిమధ్యలో ఆమె మొఖం కనిపించక కేవలం చెయ్యి మాత్రమె కనిపిస్తూ ఆ చెయ్యి పైన బిడ్డడి రూపం ఉన్న పోస్టర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇది ఒక పీరియడ్ డ్రామా అని మొదటి భాగాన్ని బాహుబలి దీ బిగినింగ్ గా పేరు పెట్టాము అని పేర్కొన్నారు రాజమౌళి . మే ముప్పై ఒకటిన ట్రైలర్ విడుదల చేస్తారు అన్న విషయం ఇప్పటికే తెలిసిందే .