ఆసియా లోనే అతిపెద్ద గూగుల్ కాంపస్ హైదరాబాద్ లో

13 May 2015

కే టీ ఆర్ అమెరికా పర్యటన సూపర్ హిట్ అయ్యింది , పెట్టుబడుల కోసం కే టీ ఆర్ యూ ఎస్ వెళ్ళిన సంగతి తెలిసిందే , ఆయన పర్యటన పూర్తి అవక మునుపే గూగుల్ ఆసియా లోనే అతిపెద్ద క్యాంపస్ పెట్టడానికి హైదరాబాద్ ని ఎంచుకుంది  హైదరాబాద్ నగరంలో వెయ్యి కోట్ల రూపాయ‌ల‌ పెట్టుబడితో గూగుల్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. గూగుల్ సంస్థకు తెలంగాణ‌ ప్రభుత్వంకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గూగుల్ ఉపాధ్యక్షుడు రాడ్‌క్లిఫ్, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌లు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.  హైదరాబాద్ కి అత్యంత సమీపం లో దాదాపు నలభై ఐదు ఎకరాల్లో గూగుల్ నూతన క్యాంపస్ ని నిర్మించడానికి అమెరికా పర్యటన లో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్ తాజాగా గూగుల్ వారితో అంగీకార పత్రాలపైన సంతకం చేయించారు . నాలుగు ఏళ్ళ కాలం లో పూర్తిగా 1000 కోట్లవరకూ ఖర్చు చెయ్యబోతోంది . దీంతో దాదాపు 13వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి