అలియా భట్ కి పెళ్లి అయిపోయిందా ?

8 May 2015

అయితే సినిమాలతో… లేదంటే పాటలతో న్యూస్‌లో ఉండే ఆలియాభట్… తాజాగా ఓ ఊహించని విషయానికి వార్తల్లోకొచ్చింది. ఉన్నట్టుండి పలు వెబ్‌సైట్లలో ఆమె పెళ్లి ఫొటో ప్రత్యక్షమవడంతో వార్తల్లోని వ్యక్తి అయిపోయింది. పెళ్లిదుస్తులు ధరించి, సహనటుడు సిద్ధార్థ మల్హోత్రాతో పాటు కారులో వెళ్తోన్న ఆ ఫొటోని చూసి ఆమె అభిమానులంతా అవాక్కయ్యారు.
అసలే ఆ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని రూమర్ కూడా ఉందేమో, వాళ్లు పెళ్లిగానీ చేసేసుకున్నారా అని సందేహపడ్డారు. అయితే అది నిజమైన పెళ్లి కాదని, కోకో కోలా యాడ్‌లోని షాట్ అని తెలిసి ఆనక ఊపిరి పీల్చుకున్నారు.