క్రిష్ 100 కోట్లు దాటగాలడా ?

5 May 2015

టాలీవుడ్ లో కృష్ణం వందే జగద్గురుం తరవాత పెద్దగా సినిమాలు చెయ్యక పోయినా , క్రిష్ హిందీ లో తన సత్తా చూపించడానికి గబ్బర్ – ఈజ్ బ్యాక్ తో శుక్రవారం విడుదల అయ్యి బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది . రివ్యూ లు కాస్త యావరేజ్ గా వచ్చినా కూడా సినిమా మాత్రం మాస్ పల్స్ తో , ఫ్యామిలీ క్రౌడ్ తో స్ట్రాంగ్ గా కలక్షన్ లు రాబడుతోంది .
శృతి హాసన్ , కరీనా కపూర్ లు అక్షయ్ కుమార్ సరసన నటించిన ఈ సినిమా తెలుగు లోని చిరంజీవి టాగూర్ కి రిమేక్ గా తెరకెక్కింది . దీంతో ట్రేడ్ పండితులు అంతా మన తెలుగు డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరుతాడని కొందరు అంచనా వేస్తున్నారు. మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్క్ సాధిస్తే క్రిష్ కి బాలీవుడ్ లో మరికొన్ని ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హిందీ లో సౌత్ దర్శకుల లో మురగదాస్ , ప్రభుదేవా మాత్రమే ఈ అవకాశాన్ని చేరుకున్నారు . క్రిష్ సినిమా ఇప్పటికే 34 కోట్లు వసూలు చేసి వీక్ ఎండ్ లో సంచలనం సృష్టించింది , గబ్బర్ 2015 లో విడుదల ఐన అన్ని సినిమాలో ఎక్కువగా కల్లెక్ట్ చేసిన చిత్రం గా బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు .